ప్రజల పక్షాన వైసీపీ తరపున ప్రభుత్వంపై పోరాటం చేస్తాం
 

by Suryaa Desk | Thu, Mar 12, 2026, 03:38 PM

అనంతపురం జిల్లా, సింగనమల నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైల‌జ‌నాథ్ పాల్గొని వైయ‌స్ఆర్, అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.  అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన నాయకుడు జ‌గ‌న్‌ అని ప్రశంసించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల, ప్రతిపక్షాల పట్ల అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.  జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తోందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. 

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM