ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.... ఎన్ఎస్‌జీ కమాండోల సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
 

by Suryaa Desk | Thu, Mar 12, 2026, 07:17 PM

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై జమ్మూ శివార్లలో హత్యాయత్నం జరిగింది. ఒక వివాహ వేడుకలో పాల్గొన్న ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది, అక్కడి ప్రజలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.


అసలేం జరిగిందంటే..?


జమ్మూ శివార్లలోని ఒక ప్రముఖ హోటల్‌లో బుధవారం జరిగిన వివాహ వేడుకకు ఫరూక్ అబ్దుల్లా హాజరు అయ్యారు. ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ ఛౌదరి కూడా ఉన్నారు. అయితే వేడుకలో అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న సమయంలో.. ఒక వ్యక్తి వెనుక నుంచి అకస్మాత్తుగా వచ్చి ఫరూక్ అబ్దుల్లాపై తుపాకీ గురిపెట్టాడు. నిందితుడు ట్రిగ్గర్ నొక్కేలోపే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు అతడిని చుట్టుముట్టి కిందకు నెట్టేశారు. అనంతరం అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


20 ఏళ్ల నాటి పగ.. నిందితుడి సంచలన వాంగ్మూలం


నిందితుడు జమ్మూకి చెందిన 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్వాల్‌గా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను గత 20 ఏళ్లుగా ఫరూక్ అబ్దుల్లాను చంపాలని ఎదురు చూస్తున్నట్లు నిందితుడు పోలీసులతో చెప్పాడు. ఇది తన వ్యక్తిగత అజెండా అని.. దీని వెనుక ఎలాంటి సంస్థల హస్తం లేదని పేర్కొన్నాడు. కాల్పులకు ప్రయత్నించిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని, ఆ తుపాకీకి లైసెన్స్ కూడా ఉందని పోలీసులు ధృవీకరించారు.


భద్రతా వైఫల్యంపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం..


ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ.. లోడ్ చేసిన తుపాకీతో ఒక వ్యక్తి అంత దగ్గరకు ఎలా రాగలిగాడు అని ఆయన ప్రశ్నించారు. ఇది స్పష్టమైన భద్రతా వైఫల్యమని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరి కూడా హోటల్ వద్ద భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని ఆరోపించారు. మరోవైపు నిందితుడి నేపథ్యంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. జమ్మూలో దుకాణాలు నడుపుకునే కమల్ సింగ్‌కు.. ఫరూక్ అబ్దుల్లాపై అంతటి పగ ఎందుకు పెరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
US, Iran ceasefire nears expiry as Hormuz tensions cloud talks Tue, Apr 21, 2026, 01:21 PM
Elderly man murdered in Mumbai's Nagpada over financial dispute, accused arrested Tue, Apr 21, 2026, 01:11 PM
Karnataka transport workers launch indefinite strike from today, BJP slams govt inaction Tue, Apr 21, 2026, 01:02 PM
Fire breaks out at private hospital in Kolkata, no casualties reported Tue, Apr 21, 2026, 12:59 PM
After Tim Cook, Apple's India story likely to accelerate under John Ternus Tue, Apr 21, 2026, 12:58 PM