స్పీకర్‌పై వీగిపోయిన విపక్షాల అవిశ్వాస తీర్మానం
 

by Suryaa Desk | Thu, Mar 12, 2026, 07:40 PM

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సభలో స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు తొలి విడత బడ్జెట్ సమావేశాల చివరలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంగళవారం నుంచి సుదీర్ఘంగా చర్చ జరగ్గా.. బుధవారం ఓటింగ్ నిర్వహించారు. మూజువాణి ఓటులో అభిశంసన వీడిపోవడంతో స్పీకర్ ఓం బిర్లా గురువారం నుంచి సభకు హాజరుకాున్నారు. ఇక, చర్చలో విపక్షాల విమర్శలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాల చివరిలో స్పీకర్‌ అభిశంసనకు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇవ్వగా.. 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు.


ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అమిత్ షా చేసిన విమర్శలకు ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమయ్యాయి. అమిత్‘అన్ పార్లమెంటరీ’ లాంగ్వేజ్‌ను ఉపయోగించారని ఆరోపించారు. ‘‘వారు ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారు. వారి నాయకుడు స్వయంగా కన్నుగీటి, దగ్గరకు వెళ్లి ప్రధాన మంత్రిని కౌగిలించుకుని, ఫ్లయింగ్ కిస్ ఇచ్చినప్పుడు అది రొచ్చగొట్టడం కాదా?’’ అని షా అన్నారు. దీనిపై హోం మంత్రి క్షమాపణ చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకుంది. తన వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైన పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని అమిత్ షా కోరారు.


స్పీకర్ అంకితభావాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని, వారు నిబంధనలు ఉల్లంఘిస్తేనే సభాపతి రంగంలోకి దిగారని అమిత్ షా మండిపడ్డారు. మొదటి ప్రధాని జవహర్‌ లాల్ నెహ్రూ హయాంలోనే పార్లమెంట్ నిబంధనలు రూపొందించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ రూపొందించిన ఈ నిబంధనలపై తాము చర్చకు సిద్ధమని, పార్టీలకు అతీతంగా సభాపతి వ్యవహరిస్తారని పేర్కొన్నారు.


ప్రతిపక్షాలు తమకు సంఖ్యాబలం లేకున్నా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఎన్డీయేకు 293 (బీజేపీ 240, టీడీపీ 16, జేడీయూ 12, ఇతరులు), ఇండియా కూటమికి 238 (కాంగ్రెస్ 99, సమాజ్‌వాదీ పార్టీ 36, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఇతరులు) సభ్యులు ఉన్నారు. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇప్పటి వరకూ ముగ్గురు స్పీకర్లు మాత్రమే అభిశంసన ఎదుర్కొన్నారు. లోక్‌సభ మొదటి స్పీకర్ జీవీ మౌలాంకర్, 1987లో బలరామ్ జాకడ్, 2026లో ఓం బిర్లా.

Latest News
Nepal: Govt employees to receive salary on fortnightly basis Mon, Apr 20, 2026, 04:12 PM
Over 6,000 Afghan refugees repatriated from Pakistan in single day Mon, Apr 20, 2026, 04:09 PM
ECI announces 48-hour 'Dry Day' ahead of polling in West Bengal, Tamil Nadu Mon, Apr 20, 2026, 03:19 PM
BJP will end hooligans' rule in West Bengal: Rajnath Singh Mon, Apr 20, 2026, 03:05 PM
CM Stalin condemns IT raid on TN Congress chief; alleges attempt to disrupt poll campaign Mon, Apr 20, 2026, 03:01 PM