బెంగాల్‌ను ప్రేమించే వారినే బెంగాల్ ప్రేమిస్తుందని సీఎం మమత వ్యాఖ్య
 

by Suryaa Desk | Thu, Mar 12, 2026, 08:37 PM

పశ్చిమ బెంగాల్ 22వ గవర్నర్‌గా ఆర్.ఎన్. రవి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయనతో తొలిసారి సంభాషిస్తూ ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు.మీరు బెంగాల్‌ను ప్రేమిస్తే, బెంగాల్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది అని ఆమె రవికి సూచనప్రాయంగా తెలిపారు.ప్రమాణ స్వీకారం ముగిశాక, మమతా బెనర్జీ కొత్త గవర్నర్‌కు మెడలో శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెంగాల్‌లో అన్ని భాషల ప్రజలు కలిసిమెలిసి శాంతియుతంగా ఉంటారు. కానీ, బెంగాల్‌ను ప్రేమించే వారిని బెంగాలీలు కూడా ప్రేమిస్తారన్నది ముఖ్యం. ఇది బెంగాలీల నైజం అని వివరించారు. దీనికి గవర్నర్ రవి స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ దేశానికి మేధో, సాంస్కృతిక రాజధాని అనేది నిజం అని అన్నారు.మమత చేసిన ఈ వ్యాఖ్యల వెనుక బలమైన రాజకీయ సందేశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా రాజ్ భవన్ నుంచి ఎలాంటి చర్యలు ఉండకూడదనేది ఆ సందేశం సారాంశం అని విశ్లేషిస్తున్నారు. గతంలో గవర్నర్‌గా పనిచేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్, ఆ తర్వాత వచ్చిన సి.వి. ఆనంద బోస్‌ల హయాంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్ భవన్‌కు మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మమత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


 


 

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM