ప్రతిరోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నాం: కేంద్రం
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 11:02 AM

వంట గ్యాస్‌ కొరతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హర్మూజ్‌ జలసంధిలోని 28 భారత నౌకలు సేఫ్‌‌గా ఉన్నట్లు వెల్లడించింది. గ్యాస్‌ సంక్షోభాన్ని నివారించడంలో రాష్ట్రాలే కీలకమని చెప్పింది. బ్లాక్‌ మార్కెట్‌ను రాష్ట్రాలే నిరోధించాలని సూచించింది. ప్రతిరోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామని స్పష్టం చేసింది.వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకుంది. రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య గ్యాప్ ప్రస్తుతం 25 రోజులు ఉండగా దాన్ని 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇక పట్టణాలు, నగరాల్లో 25 రోజుల నిబంధననే కొనసాగనుంది. కాగా పశ్ఛిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.

Latest News
Kumaraswamy criticises Cong over Women's Reservation Bill; Karnataka HM counters allegation Sat, Apr 18, 2026, 01:23 PM
Oil prices in Cambodia plunge further after Iran announces opening Hormuz Sat, Apr 18, 2026, 01:18 PM
IPL 2026: SRH pick Coetzee as injury replacement for Payne Sat, Apr 18, 2026, 01:08 PM
Chotrani goes down to world No 19 Masotti in Hamburg thriller Sat, Apr 18, 2026, 12:54 PM
Telangana BJP chief placed under house arrest ahead of protest against Oppn INDIA bloc Sat, Apr 18, 2026, 12:51 PM