ఒక ఇంటివాడు కాబోతున్న కుల్దీప్ యాదవ్
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:55 PM

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్  తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ వేదికగా రేపు వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ హై-ప్రొఫైల్ వివాహం కోసం ముస్సోరీలోని చారిత్రక సావోయ్ హోటల్‌లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి కోసం హోటల్‌ను మొత్తం బుక్ చేశారు. ఈ హోటల్‌లోని 80 గదులతో పాటు సమీపంలోని ఇతర లగ్జరీ హోటళ్లలో కూడా గదులను రిజర్వ్ చేశారు. అతిథులు, కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది కోసం ఈ భారీ ఏర్పాట్లు చేసినట్లు హోటల్ యాజమాన్యం వెల్ల‌డించింది. రెండు మూడు రోజుల పాటు ఈ హోటల్ ఇతరులకు అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. ఈ వేడుకకు టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM