వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ప్రారంభం
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 10:06 PM

WhatsApp చిన్నపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ‘పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్’ అనే ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు నేరుగా పర్యవేక్షణ చేయగలుగుతారు.గతంలో వాట్సాప్‌ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అయితే వారి చాట్స్, కాంటాక్ట్స్ లేదా ప్రైవసీ సెట్టింగ్స్‌పై తల్లిదండ్రులకు పెద్దగా నియంత్రణ ఉండేది కాదు. కొత్తగా వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ఫీచర్‌తో పిల్లల ఖాతాను తల్లిదండ్రులు సులభంగా మానిటర్ చేయగలుగుతారు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, వారు ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి అంశాలను తల్లిదండ్రులే నిర్ణయించే అవకాశం ఉంటుంది.ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే ముందుగా పిల్లల ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి యాప్‌ను ఓపెన్ చేయాలి. భాషను ఎంపిక చేసిన తర్వాత Agree and Continue పై క్లిక్ చేయాలి. అనంతరం More Options లోకి వెళ్లి Create Parent Managed Account అనే ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత పిల్లల ఫోన్ నంబర్‌ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. అలాగే పిల్లల పుట్టిన తేదీని నమోదు చేయాలి. దీని ద్వారా వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని వాట్సాప్ నిర్ధారిస్తుంది. చివరగా Continue పై క్లిక్ చేసి పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయాలి.పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేసే సమయంలో పిల్లల ఫోన్ స్క్రీన్‌పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత Agree and Continue అనే ఎంపిక కనిపిస్తుంది. ఆ తరువాత తల్లిదండ్రులు 6 అంకెల Parent PIN సెట్ చేసుకోవాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాలోని ప్రైవసీ మరియు సేఫ్టీ సెట్టింగ్స్‌ను మార్చే అవకాశం ఉంటుంది. భద్రత దృష్ట్యా ఈ పిన్‌ను పిల్లలతో పంచుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM