Flipkartలో అదిరిపోయే డీల్.. రూ.15 వేలకే 5.2.4 Dolby Atmos సౌండ్‌బార్
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:16 PM

ప్రస్తుతం జరుగుతున్న Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన సౌండ్‌బార్ డీల్ అందుబాటులోకి వచ్చింది. ఇటీవల భారత మార్కెట్లో విడుదలైన Motorola 5.2.4 Dolby Atmos సౌండ్‌బార్‌ను భారీ తగ్గింపుతో కేవలం రూ.15 వేల బడ్జెట్‌లోనే అందిస్తున్నారు.ఈ డీల్ ప్రత్యేకత ఏమిటంటే, ఎలాంటి బ్యాంక్ ఆఫర్ అవసరం లేకుండానే నేరుగా భారీ డిస్కౌంట్‌తో ఈ సౌండ్‌బార్ లభిస్తోంది. స్మార్ట్ టీవీకి సరిపోయే పవర్‌ఫుల్ సౌండ్‌బార్ కొనాలని చూస్తున్నవారు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఉన్న ఈ ఆఫర్‌ను పరిశీలించవచ్చు.5.2.4 Dolby Atmos సౌండ్‌బార్ ఆఫర్ గత సంవత్సరం ఇండియాలో విడుదలైన Motorola AmphisoundX Vibe Soundbarపై ప్రస్తుతం సుమారు 79% వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆఫర్‌తో ఈ సౌండ్‌బార్ ఇప్పుడు కేవలం రూ.15,999 ధరకే లభిస్తోంది. ఇటీవల వరకు ఇదే మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,999 ధరకు విక్రయించబడింది. అయితే ప్రస్తుతం ఇది ఇప్పటివరకు ఉన్న అత్యల్ప ధరలో అందుబాటులోకి వచ్చింది.
-Motorola 5.2.4 Dolby Atmos సౌండ్‌బార్ ఫీచర్లు :ఈ మోటరోలా సౌండ్‌బార్ 5.2.4 ఛానల్ ఆడియో సెటప్‌తో వస్తుంది. ప్రధాన సౌండ్‌బార్‌లో ముందు భాగంలో మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, పైభాగంలో రెండు అప్‌వర్డ్ ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు, డ్యూయల్ సబ్‌వూఫర్లు కూడా ఉంటాయి. ఈ పూర్తి స్పీకర్ సెటప్ కలిపి మొత్తం 700 వాట్స్ శక్తివంతమైన ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది.సౌండ్ పరంగా ఈ సౌండ్‌బార్ Dolby Atmos టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తుంది. 5.2.4 ఛానల్ సెటప్‌తో కలిపి ఇది సినిమా థియేటర్ తరహా శక్తివంతమైన సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో లేటెస్ట్ బ్లూటూత్, HDMI eARC, USB, AUX, CEC సింక్ కంట్రోల్ మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Latest News
AAP names Ashok Mittal as party's new deputy leader in Rajya Sabha, Raghav Chadha dropped Thu, Apr 02, 2026, 02:09 PM
People suffering from long COVID at increased cardiovascular disease risk: Study Thu, Apr 02, 2026, 02:01 PM
Stalin ridicules NDA's double-engine slogan, calls it 'dabba' engine Thu, Apr 02, 2026, 01:52 PM
Harassment of judicial officers in Malda a BJP-ECI conspiracy: Mamata Thu, Apr 02, 2026, 01:39 PM
Naxalite surrenders continue in Chhattisgarh; Maoist leader Rupi's guard bows out Thu, Apr 02, 2026, 01:34 PM