ఎల్పీజీ గ్యాస్ కొరత.. మార్కెట్లో వారికి పెరిగిన డిమాండ్
 

by Suryaa Desk | Sun, Mar 15, 2026, 08:14 PM

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం హోటళ్లు, హాస్టళ్లపై తీవ్రంగా పడింది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా కొంతమంది వ్యాపారాలు మూసేసుకోగా.. మరికొందరు టిఫిన్ రేట్లు పెంచారు. ఇంకొంతమంది పాతకాలం కట్టెల పొయ్యిలవైపు మళ్లారు. అయితే యుద్ధం కారణంగా ఇంతమంది ఇబ్బందులు పడుతున్నా.. మరికొందరికి మాత్రం అనూహ్యంగా డిమాండ్ తెచ్చిపెట్టింది. మంచి అవకాశాలు కల్పిస్తోంది.


ఎల్పీజీ గ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు క్రమంగా క్యాటరింగ్ పరిశ్రమపైనా పడుతోంది. హోటళ్లు, హాస్టల్స్‌ వంటి వాటితో పాటుగా క్యాటరింగ్ పరిశ్రమలో కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. పండుగల సీజన్ వచ్చేసింది. ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ ఇలా వరుసగా పండుగలు ఉన్నాయి. వాటితో పాటు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. అయితే ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా శుభకార్యాలలో విందులు ఏర్పాటు చేయడానికి క్యాటరర్లు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు వారి పండుగలు, శుభకార్యాలు అంటే పిండివంటలు, వంటకాలు హోరెత్తాల్సిందే. మెనూలో ఎన్ని రకాల వంటకాలు ఉంటే తమకు అంత గౌరవం అనేలా తెలుగు ప్రజలు భావిస్తుంటారు.


అయితే ఇప్పుడు ఇదే క్యాటరర్లకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. భారీ ఎత్తున వంటకాలు సిద్ధం చేయాలంటే వంట గ్యాస్ కావాల్సిందే. అయితే వంట గ్యాస్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులతో శుభకార్యాలలో క్యాటరింగ్ సేవలు అందించేందుకు క్యాటరర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా తమ కార్యకలాపాలను తగ్గించుకోవాల్సి వస్తోందని, లేదంటే సేవలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తోందని క్యాటరింగ్ కంపెనీలు చెబుతున్నాయి. గ్యాస్ సరఫరాపై నెలకొన్న అనిశ్చితి కారణంగా అనేకమంది క్యాటరర్లు ఇప్పటికే కొత్త బుకింగ్‌లను అంగీకరించడం మానేశారని క్యాటరింగ్ నిర్వాహకులు చెప్తున్నారు.


మరోవైపు వ్యాపారాన్ని కొనసాగించడానికి మరికొంతమంది క్యాటరర్లు పాత కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. అయితే కట్టెల పొయ్యిపై వంట చేయటమనేది చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఎల్పీజీ గ్యాస్ వంటతో పోలిస్తే కట్టెల పొయ్యిలపై వంట చేయడం ఆలస్యం కావటమే కాకుండా.. శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఇక శుభకార్యాలలో వందలాది మంది అతిథులకు పెద్ద మొత్తంలో వంటకాలు సిద్ధం చేయాలంటే మరింత ఎక్కువ సమయం పడుతుంది. అయినప్పటికీ కొంతమంది క్యాటరర్లు ముుందుగా అంగీకరించిన బుకింగ్స్ సేవలు అందించేందుకు వీటివైపు మొగ్గు చూపుతున్నారు.


ఇదే కాకుండా కట్టెల పొయ్యిపై వంటలు వండాలంటే క్యాటరర్లను మరో సమస్య కూడా ఇబ్బంది పెడుతోంది. కట్టెల పొయ్యిని ఉపయోగించి పలు రకాల వంటకాలు వండే చెఫ్‌లు దొరకడం కష్టంగా మారింది. ఇప్పుడు ఉన్నవారికి ఎల్పీజీ గ్యాస్ మీద వంటలు వండటమే అలవాటు కానీ.. పాత కట్టెలపొయ్యిపై వంటలు వండిన అనుభవం ఉన్న వారు తక్కువ. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావటంతో ప్రస్తుతం ఇలాంటి వారికి డిమాండ్ పెరుగుతోందని క్యాటరింగ్ నిర్వాహకులు చెప్తున్నారు.. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సంక్షోభం ముగిసిపోవాలని క్యాటరర్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు కోరుకుంటున్నారు.

Latest News
6,000 PNG consumers give up LPG connections to help others Sun, Mar 29, 2026, 04:40 PM
IPL 2026: Mumbai Indians set to become first team to play 300 matches Sun, Mar 29, 2026, 04:32 PM
PM Modi says Kerala is ready for change; targets LDF and UDF Sun, Mar 29, 2026, 04:30 PM
One killed, 10 injured as mini-bus strikes motorists in Eastern Afghanistan Sun, Mar 29, 2026, 04:27 PM
Sri Lankan President Dissanayake expresses gratitude to India for swift fuel support Sun, Mar 29, 2026, 03:54 PM