బెంగళూరు పేస్ బౌలర్ యశ్ దయాళ్ ఓ ఇంటివాడయ్యాడు
 

by Suryaa Desk | Sun, Mar 15, 2026, 09:59 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  పేస్ బౌలర్ యశ్ దయాళ్ ఓ ఇంటివాడయ్యాడు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ శ్వేత పుండిర్‌ను వివాహం చేసుకున్నాడు. గత నెలలోనే వీరి పెళ్లి జరిగినప్పటికీ, ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.మీడియా కథనాల ప్రకారం, వీరి వివాహం ఫిబ్రవరి 4న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ జంట తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించలేదు. అయితే, దయాళ్ తో ఉన్న కొన్ని క్షణాలను శ్వేత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రూపంలో పంచుకున్నారు. ఢిల్లీకి చెందిన శ్వేత పుండిర్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, వ్లాగర్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు ఇన్‌స్టాలో 5.87 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా యశ్ దయాళ్ ఐపీఎల్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడి, ఆ జట్టు టైటిల్ గెలవడంలో భాగమయ్యాడు. ఆ తర్వాత 2024 సీజన్‌లో ఆర్సీబీకి మారాడు. గత ఏడాది ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలోనూ దయాళ్ కీలక పాత్ర పోషించాడు.మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్సీబీ యాజమాన్యం అతడిని అట్టిపెట్టుకుంది. ఈ సీజన్‌లో టైటిల్ డిఫెండింగ్ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి దయాళ్ సేవలు కీలకం కానున్నాయి. మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

Latest News
6,000 PNG consumers give up LPG connections to help others Sun, Mar 29, 2026, 04:40 PM
IPL 2026: Mumbai Indians set to become first team to play 300 matches Sun, Mar 29, 2026, 04:32 PM
PM Modi says Kerala is ready for change; targets LDF and UDF Sun, Mar 29, 2026, 04:30 PM
One killed, 10 injured as mini-bus strikes motorists in Eastern Afghanistan Sun, Mar 29, 2026, 04:27 PM
Sri Lankan President Dissanayake expresses gratitude to India for swift fuel support Sun, Mar 29, 2026, 03:54 PM