వాట్సాప్‌ అకౌంట్‌ లేకుండానే.. వాట్సాప్‌ యూజర్లతో చాటింగ్‌ చేయవచ్చు..!
 

by Suryaa Desk | Mon, Mar 16, 2026, 10:48 PM

WhatsAppలో అకౌంట్ లేకుండానే చాట్ చేసే అవకాశాన్ని కల్పించే కొత్త ఫీచర్‌పై గతంలో ఫీచర్ ట్రాకర్ WABetaInfo కీలక సమాచారం వెల్లడించింది. ఈ ఫీచర్‌ను “గెస్ట్ చాట్స్” పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. తాజాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ Guest Chats ఫీచర్‌ను వాట్సాప్ టెస్టింగ్ దశలో ఉంచినట్లు సమాచారం. కొంతమంది ఆండ్రాయిడ్, iOS బీటా యూజర్లకు ఇప్పటికే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ ఖాతా లేకపోయినా ప్రత్యేక లింక్ సహాయంతో ఇతర వాట్సాప్ వినియోగదారులతో చాట్ చేసే అవకాశం ఉంటుంది.ఈ ఫీచర్‌లో భాగంగా వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తులతో మాట్లాడాలంటే వారికి ఒక ప్రత్యేక లింక్ పంపించాలి. “Invite a Friend” అనే ఆప్షన్ ద్వారా ఆ లింక్‌ను షేర్ చేయవచ్చు. అలాగే కాంటాక్ట్ లిస్ట్ నుంచే కూడా ఈ లింక్ పంపే అవకాశం ఉంటుంది. అవసరమైతే SMS, ఇమెయిల్ లేదా ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా కూడా ఈ లింక్‌ను పంపించవచ్చు. ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తులు కూడా తమ ఫోన్ లేదా డెస్క్‌టాప్ ద్వారా చాట్ చేయగలరు. ముఖ్యంగా ఈ ఫీచర్‌లో కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో చాటింగ్ సురక్షితంగా ఉంటుంది.వాట్సాప్‌లో గెస్ట్ చాట్స్ ప్రధాన చాట్ లిస్ట్‌లో పైభాగంలో కనిపించేలా ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ద్వారా కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే పంపే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. గ్రూప్ చాట్స్, వీడియో కాల్స్ లేదా మీడియా ఫైల్స్ షేర్ చేసే సదుపాయం ఇందులో ఉండదని సమాచారం. అంతేకాకుండా ఈ చాట్ లింక్ కేవలం 10 రోజుల పాటు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత అది ఆటోమేటిక్‌గా ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా, త్వరలోనే ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.ఇదిలా ఉండగా Meta Platformsకు చెందిన మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Instagram ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్ల ప్రైవసీ కోసం అందుబాటులో ఉంచిన ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మే 8 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది. అయితే ఈ నిర్ణయం వెనుక కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఎన్‌క్రిప్షన్ సపోర్ట్ తొలగించిన తర్వాత యూజర్ల చాట్‌లను విశ్లేషించే అవకాశం మెటాకు లభిస్తుందని సమాచారం. ఈ మార్పుతో ప్రభావితమయ్యే యూజర్లకు తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తామని సంస్థ పేర్కొంది.అసభ్యకర లేదా హానికర కంటెంట్‌ను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూరప్‌లో ప్రతిపాదించిన చాట్ కంట్రోల్ రెగ్యులేషన్, అలాగే బ్రిటన్‌లో అమల్లోకి వచ్చిన Online Safety Act 2023 వంటి చట్టాల నేపథ్యంలో ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ చట్టాలు పూర్తిగా అమల్లోకి వస్తే అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వాలు యూజర్ల ప్రైవేట్ చాట్‌లను పర్యవేక్షించే అధికారం పొందే అవకాశం ఉందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Latest News
Andhra bus fire tragedy: State govt announces Rs 5 lakh ex gratia Thu, Mar 26, 2026, 05:00 PM
India to boost critical mineral exploration, push startup-led mining ecosystem: Dr Jitendra Singh Thu, Mar 26, 2026, 04:48 PM
Bengaluru medical school professor assaulted after allegedly proposing to student in classroom Thu, Mar 26, 2026, 04:44 PM
'I heard RCB chants when Wankhede was silent': Bethell recalls T20 WC knock vs India Thu, Mar 26, 2026, 04:38 PM
Pakistan: Over 14,000 schools damaged by 2022 floods in Sindh still await restoration Thu, Mar 26, 2026, 04:37 PM