Oura Ring 4 మ్యాజిక్.. మీ బాడీ సీక్రెట్స్ అన్నీ మీ చేతిలోనే!
 

by Suryaa Desk | Tue, Mar 17, 2026, 10:23 PM

ఫిన్నిష్ హెల్త్ టెక్నాలజీ సంస్థ Oura Health మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. మంగళవారం (మార్చి 17) భారత మార్కెట్‌లో తన తొలి స్మార్ట్ రింగ్ Oura Ring 4ను విడుదల చేసింది.వేలికి ధరించే ఈ చిన్న వేరబుల్ ద్వారా గుండె ఆరోగ్యం నుంచి నిద్ర వరకు పూర్తి ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ డివైస్ ఇప్పుడు భారత ఫిట్‌నెస్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.ఈ స్మార్ట్ రింగ్ ప్రధానంగా హెల్త్ ట్రాకింగ్, స్లీప్ అనాలిసిస్, రికవరీ డేటాపై ఫోకస్ చేస్తుంది. ఇది Oura Appతో కనెక్ట్ అయి పనిచేస్తుంది. బ్లూటూత్ లో ఎనర్జీ (LE) సపోర్ట్‌తో కూడిన ఈ రింగ్, స్మార్ట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా ఖచ్చితమైన, వ్యక్తిగతీకరించిన ఆరోగ్య డేటాను అందిస్తుందని కంపెనీ తెలిపింది.ధర విషయానికి వస్తే, బ్లాక్ మరియు సిల్వర్ వేరియంట్లు రూ.28,900 నుంచి ప్రారంభమవుతాయి. బ్రష్డ్ సిల్వర్, రోజ్ గోల్డ్, స్టెల్త్ వంటి ప్రీమియం వేరియంట్లు రూ.39,900 వరకు ఉంటాయి. ఈ రింగ్ 12 సైజుల్లో అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు తమకు సరిపోయే ఫిట్‌ను ఎంచుకోవచ్చు.మార్చి 18 నుంచి ఇది ఆన్‌లైన్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. అదనంగా రూ.599 నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మరింత లోతైన ఆరోగ్య విశ్లేషణ పొందవచ్చు.ఈ డివైస్‌లో అత్యంత ప్రత్యేకమైన అంశం దాని అడ్వాన్స్‌డ్ స్మార్ట్ సెన్సింగ్ టెక్నాలజీ. పరిశోధన స్థాయి సెన్సార్లు, ఆధునిక అల్గారిథమ్‌ల సహాయంతో ఇది అత్యంత కచ్చితమైన డేటాను అందిస్తుంది. టోక్యో యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వంటి సంస్థలు దీని ఖచ్చితత్వాన్ని ధృవీకరించినట్లు కంపెనీ పేర్కొంది.PPG system ఆధారంగా పనిచేసే ఈ రింగ్‌లో 18-పాత్ మల్టీ-వేవ్‌లెంగ్త్ సిస్టమ్ ఉంది. ఇది హృదయ స్పందన రేటు, HRV, నిద్ర దశలు, శరీర ఉష్ణోగ్రత, రక్త ఆక్సిజన్ స్థాయిలను నిరంతరం ట్రాక్ చేస్తుంది. రాత్రి సమయంలో ఎరుపు, ఇన్‌ఫ్రారెడ్ LEDల సహాయంతో శ్వాసకోశ రేటును కూడా అంచనా వేస్తుంది.అదనంగా యాక్సిలరోమీటర్, టెంపరేచర్ సెన్సార్లు వంటి ఫీచర్లతో రోజువారీ కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తుంది.డిజైన్ పరంగా చూస్తే, టైటానియంతో తయారైన ఈ రింగ్ తేలికగా ఉండి ధరించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. దీని బరువు కేవలం 3.3 నుంచి 5.2 గ్రాముల మధ్యే ఉంటుంది. 100 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.బ్యాటరీ విషయానికి వస్తే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 రోజుల వరకు పనిచేస్తుంది. పూర్తి ఛార్జ్ కావడానికి 20 నుంచి 80 నిమిషాలు పడుతుంది.మొత్తంగా, Oura Ring 4 ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలనుకునే వారికి ఒక స్మార్ట్, అడ్వాన్స్‌డ్ వేరబుల్‌గా నిలుస్తోంది.

Latest News
India's markets to recoup lost ground, RBI rate hike unlikely: Report Wed, Mar 25, 2026, 05:02 PM
Jasprit Bumrah checks into BCCI CoE for workload management ahead of IPL 2026: Report Wed, Mar 25, 2026, 04:57 PM
Gujarat: BJP core committee meets at CM's residence after Assembly passes UCC Bill Wed, Mar 25, 2026, 04:56 PM
Pakistan's rapidly expanding weapons arsenal raises doubts over 'minimum deterrence' claims Wed, Mar 25, 2026, 04:20 PM
Karnataka deficit under control compared to other Southern states: CM Siddaramaiah Wed, Mar 25, 2026, 04:17 PM