|
|
by Suryaa Desk | Thu, Mar 19, 2026, 09:39 PM
మంచి ప్రైవేట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. హైదరాబాద్‌లోనే ఉంటూ బిజినెస్ కన్సల్టింగ్, కార్పొరేట్ స్ట్రాటజీ రంగాల్లో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే వారికి ఈ ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. ప్రముఖ ఐటీ సర్వీసెస్ మరియు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ AIT గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ కార్యాలయంలో ‘బిజినెస్ కన్సల్టెంట్ ఇంటర్న్’ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు 3 నెలలపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో నెలకు రూ.36,000 నుంచి రూ.40,000 వరకు స్టైఫండ్ అందించనున్నారు. ఇందులో రూ.26,000–28,000 వరకు ఫిక్స్‌డ్ పేమెంట్ ఉండగా, మిగతా రూ.10,000–12,000 వరకు ఇన్సెంటివ్స్ రూపంలో ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి సంవత్సరానికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ప్యాకేజీతో పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంది.ఇంటర్న్‌గా పనిచేసే సమయంలో అభ్యర్థులు క్లయింట్లతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను అర్థం చేసుకోవాలి. అవసరమైన సమాచారాన్ని సేకరించి డాక్యుమెంట్ చేయడం, ప్రాజెక్ట్‌లలో టీమ్‌తో కలిసి పనిచేయడం వంటి బాధ్యతలు ఉంటాయి. వ్యాపార ప్రక్రియల్లో కూడా నేరుగా పాల్గొనాల్సి ఉంటుంది.ఈ ఇంటర్న్‌షిప్‌కు ఇంజనీరింగ్, B.Com, BA లేదా HR, సప్లై చైన్, ఫైనాన్స్ విభాగాల్లో MBA పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్ కన్సల్టింగ్‌పై ఆసక్తి ఉండాలి. MS PowerPointపై మంచి పరిజ్ఞానం ఉంటే అదనపు ప్రయోజనం. ఇంగ్లీష్‌లో మాట్లాడటం, రాయడం మీద పట్టు ఉండటం తప్పనిసరి. అభ్యర్థులకు సొంత ల్యాప్‌టాప్ ఉండాలి. కెరీర్ బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభించాలనుకునే మహిళలు కూడా అప్లై చేయవచ్చు.అభ్యర్థులు ప్రెజెంటబుల్‌గా ఉండి, కస్టమర్లతో ధైర్యంగా మాట్లాడగలగాలి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యం ఉండాలి. ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక సర్టిఫికేట్ మరియు లెటర్ ఆఫ్ రికమెండేషన్ అందిస్తారు. వారానికి 5 రోజుల పని మాత్రమే ఉంటుంది. పనితీరు బాగుంటే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఏప్రిల్ 18లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారు మార్చి 19 నుంచి ఏప్రిల్ 23 మధ్యలో జాయిన్ కావాల్సి ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా Internshala వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అప్లై చేయవచ్చు.AIT గ్లోబల్ ఒక అంతర్జాతీయ సంస్థగా క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలను అందిస్తుంది. వారి వ్యాపార లక్ష్యాలను సాధించడంలో సహాయపడటం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ఇక్కడి ఉద్యోగులను ‘AITians’ అని పిలుస్తారు. బాధ్యతతో పనిచేసేలా ప్రోత్సహించే మంచి పని వాతావరణం ఈ సంస్థ ప్రత్యేకత.
Latest News