|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 10:13 PM
భారతదేశంలో ప్రైవేట్ రంగం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు కోట్లాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. అయితే, అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించి, వారికి భారీ జీతాలు అందిస్తున్న కంపెనీలు ఏవో తెలుసా? సాధారణంగా చాలామందికి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ అదానీకి చెందిన సంస్థలే గుర్తుకురాగలవు. కానీ నిజానికి పరిస్థితి వేరేలా ఉంది. దేశంలో అత్యధిక జీతాల పంపిణీ చేస్తున్న టాప్ 10 కంపెనీల జాబితాలో రిలయన్స్ లేదా అదానీ గ్రూప్ సంస్థలకు చోటు దక్కలేదు.ఉద్యోగుల సంఖ్య, వార్షిక వేతనాల పరంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అగ్రస్థానంలో నిలిచింది. జీతాల పంపిణీలో టాప్ 10 కంపెనీలలో ముఖ్యంగా ఐటీ రంగ కంపెనీలు ఆధిపత్యం చూపుతున్నాయి.ఐటీ రంగానికి ప్రధమ స్థానం.ఈ జాబితాను గమనిస్తే, సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల రంగం అత్యధిక ఉపాధిని మరియు వేతనాలను అందిస్తున్నది స్పష్టమవుతోంది. టీసీఎస్ మొదటి స్థానంలో ఉండగా, నారాయణమూర్తి ఆధ్వర్యంలోని ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ రంగం నుంచి ఎస్‌బీఐ, కోల్ ఇండియా మాత్రమే జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటికీ, అంబానీ, అదానీ కంపెనీలు ఐటీ రంగ కంపెనీల వంటి లక్షలాది ఉద్యోగులకు భారీ జీతాలు ఇవ్వడంలో వెనుకబడినట్టే ఉంది.
Latest News