|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 12:30 PM
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. "కనీసం ఈరోజైనా ఆ 11 మంది ఎమ్మెల్యేలు సభకు వస్తారని ఆశించాను. చేసిన తప్పులను సభలో ఒప్పుకునే ధైర్యం వారికి లేదని నాకు అర్థమైంది. రైతుల ఉసురు తగిలినా కూడా వారు గుణపాఠం నేర్చుకోలేదు" అని స్పీకర్ పేర్కొన్నారు. రైతుల ఆవేదనను పట్టించుకోని వారిపై ఆయన విమర్శలు గుప్పించారు.
Latest News