ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం
 

by Suryaa Desk | Wed, Apr 01, 2026, 11:33 AM

దేశవ్యాప్తంగా జనగణన కార్యక్రమం ఏప్రిల్ 1 (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏపీలో ఏప్రిల్ 16, తెలంగాణలో 23 నుంచి మొదలవుతుంది. స్వాతంత్య్రం తర్వాత ఇది 16వ జనగణన. కరోనా కారణంగా వాయిదా పడిన జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 11,718 కోట్లు ఖర్చు చేస్తోంది. సొంత ఇళ్లు, ఇళ్లు లేనివారు, ఇంటి నిర్మాణ సామగ్రి, తాగునీటి వసతి, విద్యుత్, మరుగుదొడ్డి, వంటగ్యాస్ వినియోగం వంటి అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఇంటింటి సర్వేతో పాటు ఆన్‌లైన్‌లోనూ గణనలో పాల్గొనే అవకాశం ఉంది.

Latest News
MMA: Puja Tomar eyes crucial Strawweight win at UFC Macau Thu, Apr 02, 2026, 11:09 AM
Solar power surge helps TN manage rising summer demand Thu, Apr 02, 2026, 11:09 AM
CBI arrests Srinagar EPFO official, aide for bribery Wed, Apr 01, 2026, 04:35 PM
Mizoram leads Northeast region as first state to launch digital Census 2027, self-enumeration drive Wed, Apr 01, 2026, 04:28 PM
Gujarat Dy CM presides over jobs for differently-abled staff, aid to farmers' heirs Wed, Apr 01, 2026, 04:16 PM