|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 01:53 PM
బుధవారం గుండారావు పేట స్వర్ణ వార్డు పరిధిలో జిల్లా కలెక్టర్ సి. యం. సాయి కాంత్ వర్మ ఎన్. టి. ఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పేదల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. మంచంపైన ఉన్న దివ్యాంగురాలు మనస్విని, దుగ్గిపోగు సలోమి, యేసయ్య, సలికినేటి ప్రేమ కుమార్ లతో పాటు వీధిలోని అందరికీ పింఛన్లు అందించారు. జిల్లాలో మొత్తం 2, 53, 379 మంది పింఛనుదారులకు రూ. 110. 50 కోట్లు పంపిణీ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
Latest News