|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 10:25 PM
ఆర్థిక సంవత్సరం 2025–26 చివరి నెల అయిన మార్చిలో దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గడిచిన నెలలో ఇవి 8.8 శాతం వృద్ధి చెంది రూ.2 లక్షల కోట్లను దాటాయి.ఇది జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మించటం మూడోసారి కావడం విశేషం. అంతకుముందు 2025 ఏప్రిల్‌లో రూ.2.36 లక్షల కోట్లు, మేలో రూ.2.01 లక్షల కోట్లు వసూలై రికార్డులు సృష్టించాయి. 2025 మార్చిలో నమోదైన రూ.1.83 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 9 శాతం పెరుగుదల కనిపించింది.మొత్తం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ వసూళ్లు 8.3 శాతం పెరిగి రూ.22.27 లక్షల కోట్లకు చేరాయి.మార్చి నెలలో దేశీయంగా విక్రయాలు పెరగడం, అలాగే దిగుమతులు అధికం కావడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా 5.8 శాతం వృద్ధితో రూ.1.46 లక్షల కోట్ల ఆదాయం లభించగా, దిగుమతులపై పన్ను వసూళ్లు 17.8 శాతం పెరిగి రూ.53,861 కోట్లకు చేరాయి.రిఫండ్ల సర్దుబాటు అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
Latest News