|
|
by Suryaa Desk | Thu, Apr 02, 2026, 02:31 PM
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడిప్రజారోగ్య శాఖ (డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్-డీహెచ్) ద్వారా శాశ్వత ప్రాతిపదికన (రెగ్యులర్ )482 మంది వైద్యులకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఉత్తర్వులు పొందిన వారు 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు, బోధనాసుపత్రుల్లో ట్యూటర్ల కేటగిరిలో కలిపి 636 పోస్టుల భర్తీకి కిందటేడాది నోటిఫికేషన్ (13/2025) జారీచేయగా సుమారు 5వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఎంబీబీఎస్ అర్హతతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రిజర్వేషన్, ఇతర నియము నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన జాబితాను మార్చి 11న నియామక బోర్డు ప్రకటించింది. దీనికి అనుగునంగా స్పోర్ట్స్ కేటగిరి మినహాయించి 611 పోస్టుల భర్తీ చర్యల్లో భాగంగా ఎంపికైన వారి నుంచి సోమవారం ఉదయం 11 నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఆప్షన్లు (ఐచ్ఛికాలు) స్వీకరించారు. తొలుత ప్రకటించిన సమయం కంటే అభ్యర్థుల విజ్ఞప్తిమేరకు అప్షన్ల నమోదు సమయాన్ని అదనంగా పెంచారు. నియామక కౌన్సిలింగ్ ప్రక్రియ, పోస్టింగ్ ఉత్తర్వులు జారీ పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ లో జరిగింది.
ఆప్షన్లకు అనుగుణంగా..
611 పోస్టులకుగాను 482 మంది అభ్యర్థులు స్పందించారు. నియమ నిబంధనలు అనుసరించి, వీరందరికీ ఆన్లైన్ ద్వారానే బుధవారం పోస్టింగు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగిత రహితంగానే ఈ ప్రక్రియ మొత్తం జరిగింది. ఇంతకుముందు వరకు జూమ్ కాన్ఫరెన్స్ విధానంలో డిస్ప్లే చేసిన ఖాళీలకు అనుగుణంగా అభ్యర్థులు స్థానాలు ఎంపికచేసుకుని పోస్టింగులు పొందారు. ఈ సారి నియామకాల్లో మరింత పారదర్శకత పెరిగేలా ఆన్లైన్ కౌన్సెలింగ్ను నిర్వహించారు. ఆసుపత్రుల వారీగా ప్రకటించిన పోస్టులన్నింటికీ ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు అప్షన్లు ఇచ్చుకున్నారు. దీని ప్రకారం ఆన్లైన్ ద్వారానే అభ్యర్థులకు పోస్టింగులు ఉత్తర్వులు జారీచేసినట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి వెల్లడించారు పోస్టింగులు ఇచ్చిన 482లో కొన్ని ట్యూటర్ల పోస్టులు ( బోధన ఆస్పత్రులు) ఉన్నాయని వెల్లడించారు.జిల్లాల వారీగా..।రాష్ట్రంలోనే అత్యధికంగా కడప జిల్లాలో 52 మందికి పోస్టింగులు ఉత్తర్వులు ఇచ్చారు తరువాత అనంతపురం-34, శ్రీకాకుళం-31, కాకినాడ-29, కర్నూలు-27, పల్నాడు-26, ఎన్టీఆర్-23, నంద్యాల-19, కృష్ణా-19, ప్రకాశం-17, ఏలూరు-17, విజయనగరం- 16, పశ్చిమగోదావరి-15, గుంటూరు-14, పార్వతీపురం మన్యం-14, అంబేద్కర్ కోనసీమ-13, .
Latest News