|
|
by Suryaa Desk | Thu, Apr 02, 2026, 03:05 PM
బస్సు కండిషన్ బాగాలేదని తెలిసినా లైసెన్స్ లేని డ్రైవర్‌తో బస్సు నడిపించి 14 మంది ప్రాణాలు తీసిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంఏపీ మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు జగిత్యాల నుండి మార్కాపురం వెళ్లేలోగా బస్సు మూడుసార్లు ఆగిపోయిందని, యజమానికి ఫోన్ చేసి వేరే బస్సు పంపమని అడిగితే, ఇప్పటికిప్పుడు ఇంకో బస్సు ఎక్కడి నుండి వస్తుందని ఓనర్ బదులిచ్చాడని విచారణలో సమాధానం ఇచ్చిన డ్రైవర్ ఆగిపోయిన బస్సు స్టార్ట్ అయ్యాక క్లీనర్ బస్సు నడిపాడని, మార్కాపురం వద్ద ప్రమాదానికి గురైందని డ్రైవర్ వివరణ అయితే ఎనిమిది నెలల క్రితం బస్సు లీజుకు తీసుకుని, కండిషన్ సరిగ్గా లేకున్నా బస్సు నడిపిస్తున్నాడని, లైసెన్స్ ఉన్న డ్రైవర్ జీతం ఎక్కువగా అడుగుతాడని, లైసెన్స్ లేని డ్రైవర్‌తో బస్సు నడిపిస్తున్నాడని గుర్తించిన పోలీసులు అయితే ప్రమాద సమయంలో తానే బస్సు నడిపానని ఓనర్ చెప్పినా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బస్సు క్లీనర్ నడిపినట్లు పోలీసుల గుర్తింపుయర్రగొండపాలెంలో బస్సు పాడైనందున నడిపేందుకు వెళ్లి మార్కాపురం వద్దే వేచి ఉన్నాడని, ఓనర్ ఉన్న చోటు వరకు క్లీనర్ నడుపుతుండగా ప్రమాదం జరిగినట్లు తేల్చిన పోలీసులు అయితే లైసెన్స్ లేని డ్రైవర్ బస్సు నడపడంతో, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావని ఇన్సూరెన్స్ సంస్థలు చెప్తున్నాయని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్న బాధితులు
Latest News