|
|
by Suryaa Desk | Fri, Apr 03, 2026, 11:15 AM
తిరుమల శ్రీవారిని గురువారం (ఏప్రిల్ 3) రోజున 72,576 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 23,887 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లుగా ఉంది. (ఏప్రిల్ 4) ఉదయం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... ప్రస్తతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేకుండా నేరుగా వచ్చే భక్తుల తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక, తిరుమలలో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు మూడు గంటల్లోపే శ్రీవారి దర్శనం లభించనుంది.ఇదిలాఉంటే, రోజున తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద పదివేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. ఈ టోకెన్లు పొందిన భక్తులకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో దర్శనం కానుంది. ఇదిలాఉంటే, శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు మరో రెండు వేల టోకెన్లు జారీ చేశారు.
Latest News