|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 10:54 AM
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇచ్చిన వివరణను అధిష్టానం పరిశీలించిన నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు చేశారు. వివరణపై చర్చ సందర్భంగా కొందరు నేతల ప్రవర్తనను ఉద్దేశించి, 'గీత దాటి ప్రవర్తించే వారిని ఇక భరించేది లేదు' అని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఇకపై పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సస్పెండ్ చేయడమేనని ఆయన స్పష్టం చేశారు.
Latest News