|
|
by Suryaa Desk | Sun, Apr 05, 2026, 04:43 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధి అంశంపై ఇరాన్‌కు 48 గంటల గడువు విధిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ గడువులోగా జలసంధిని తెరవకపోతే లేదా ఒప్పందానికి రాకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇచ్చిన గడువు ముగియబోతుండటంతో చివరి అల్టిమేటంగా ఈ ప్రకటన చేసినట్లు తెలిపారు.యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. కూలిపోయిన యుద్ధ విమానానికి చెందిన పైలట్ కోసం అమెరికా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, ఇరాన్ కూడా అతని ఆచూకీ కోసం అన్వేషిస్తోంది. ఈ ఘటనలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి . ఇరాన్‌లోని అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన దాడిపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భవనానికి నష్టం జరిగినప్పటికీ ప్రమాదకర కిరణాలు వెలువడలేదని తెలిపింది. అణు భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Latest News