LPG Cylinder: వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు?
 

by Suryaa Desk | Mon, Apr 06, 2026, 11:24 AM

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. అయితే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ పొందవచ్చు. 2016 మే 1న ప్రారంభమైన ఈ పథకం, గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు ఏటా 12 సిలిండర్లపై సబ్సిడీ అందిస్తుంది. ఇప్పటివరకు 10 కోట్లకు పైగా ప్రజలు లబ్ధి పొందారు. ఈ పథకం సామాజిక, ఆర్థిక రంగాలపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. పేద కుటుంబాల జీవితాలను గణనీయంగా మార్చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పొగలేని వంటగదులు పొందడం దీని ముఖ్య లక్ష్యం. శుభ్రమైన ఎల్‌పీజీ గ్యాస్ ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడింది.గతంలో ఇంట్లో కట్టెలు, పశువుల పేడ, బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధనాలు వాడటం సాధారణం. వీటి వల్ల వచ్చే పొగ మహిళలు, పిల్లల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగించేది. ఉజ్జ్వల యోజన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించింది.

Latest News
Ashok Gehlot targets government over sports infrastructure Wed, Apr 08, 2026, 02:16 PM
Bypolls will be a bye-bye message to Karnataka govt, says BJP Wed, Apr 08, 2026, 02:06 PM
Hotel raids in Jharkhand take dramatic turn: Couple marries on street, three others sign wedding bonds Wed, Apr 08, 2026, 01:59 PM
Restraint, dialogue takes precedence over confrontation: Kashmir Mirwaiz on US-Iran ceasefire Wed, Apr 08, 2026, 01:21 PM
Musk seeks removal of OpenAI CEO Altman, Brockman amid legal battle Wed, Apr 08, 2026, 01:09 PM