|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 12:10 PM
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పరుగులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ తరఫున ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటైన రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. ఈ ఏడాది ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఏడుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నాడు.
Latest News