|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 09:22 PM
జస్ట్ నిన్ననే Motorola అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ Edge 70 Pro గురించి చర్చించుకున్నాం. అయితే ఈరోజు ఈ ఫోన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మోటోరోలా ఇండియా మార్కెట్లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్‌తో పాటు కీలక ఫీచర్లను కూడా అధికారికంగా వెల్లడించింది.
*Motorola Edge 70 Pro లాంచ్ డేట్ : Motorola Edge 70 Pro స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ వివరాలను Flipkartలోని ప్రత్యేక మైక్రోసైట్ టీజర్ పేజీ ద్వారా వెల్లడించారు. అదే పేజీలో ఫోన్‌కు సంబంధించిన ప్రధాన ఫీచర్లను కూడా రివీల్ చేశారు.
*కీలక ఫీచర్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్లీక్ మరియు ప్రీమియం డిజైన్‌తో తీసుకురానున్నారు. ఇది శాటిన్ లక్స్, ఫాబ్రిక్ ఫినిష్ మరియు మార్బుల్ ఫినిష్ అనే మూడు స్టైలిష్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో MediaTek Dimensity 8500 Extreme చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఇది 2.4 మిలియన్ పైగా AnTuTu స్కోర్ సాధిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనితో పాటు 12GB LPDDR5X RAM కూడా అందించనున్నారు.కెమెరా విభాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, ప్రధానంగా 50MP Sony LYT-710 సెన్సార్ ఉంటుంది. ఇది 4K 60FPS వీడియో రికార్డింగ్, AI ఆధారిత కెమెరా ఫీచర్లు మరియు ప్రత్యేక మోటోరోలా ఫిల్టర్లను సపోర్ట్ చేస్తుంది. అదనంగా వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇందులో అందించనున్నారు.డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.8 ఇంచ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్‌కు Gorilla Glass 7i రక్షణ ఉంటుంది. అలాగే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ మరియు IP68, IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది.బ్యాటరీ విభాగంలో 6500mAh భారీ బ్యాటరీతో పాటు 90W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించనున్నారు. ఆడియో అనుభవం కోసం డ్యూయల్ స్పీకర్లు, Dolby Atmos మరియు Hi-Res Audio సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కానుంది.