ఎండల తీవ్రత షాక్.. భగభగమంటున్న సూర్యుడు!
 

by Suryaa Desk | Wed, Apr 15, 2026, 10:27 PM

రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ భానుడు భగ్గుమంటుండటంతో జనజీవనం ఇబ్బందులకు గురవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్–మల్కాజ్‌గిరి ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది.రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచే పరిస్థితి నెలకొనవచ్చని సూచించారు. ఈ సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Latest News
No plans yet to attend next round of talks with US: Iran Mon, Apr 20, 2026, 04:44 PM
Nepal: Govt employees to receive salary on fortnightly basis Mon, Apr 20, 2026, 04:12 PM
Over 6,000 Afghan refugees repatriated from Pakistan in single day Mon, Apr 20, 2026, 04:09 PM
ECI announces 48-hour 'Dry Day' ahead of polling in West Bengal, Tamil Nadu Mon, Apr 20, 2026, 03:19 PM
BJP will end hooligans' rule in West Bengal: Rajnath Singh Mon, Apr 20, 2026, 03:05 PM