|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 10:43 AM
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజు శ్రీవారిని 69,049 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.57 కోట్లుగా నమోదైంది.
Latest News