|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 12:48 PM
పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను స్వయంగా విని, వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసిన కలెక్టర్, ప్రతి అర్జీపై సమగ్రంగా స్పందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Latest News