|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 02:22 PM
పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం భారత వ్యవసాయ రంగంపైనా కనిపిస్తోంది. గ్యాస్ దిగుమతులు తగ్గిపోవడంతో యూరియా ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని కేంద్రం సోమవారం రాత్రి వెల్లడించింది. దేశంలో ఎరువుల ఉత్పత్తి సుమారు 24.6 శాతం పడిపోయిందని సమాచారం. ప్రధానంగా సహజ వాయువు సరఫరా తగ్గడం వల్ల యూరియా తయారీపై ప్రత్యక్ష ప్రభావం పడింది. దీంతో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ సరఫరా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Latest News