|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 10:05 PM
కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి ప్రభుత్వ హామీ ఉండటంతో పెట్టుబడులకు పూర్తి భద్రత లభిస్తుంది. ప్రస్తుతం వివిధ సేవింగ్స్ స్కీమ్‌లు అందుబాటులో ఉండగా, వాటిలో కోట్లాది మంది ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు. అలాంటి పథకాలలో ఒకటి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC).ఈ పథకంలో పెట్టుబడికి ప్రస్తుతం 7.7 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పొదుపు పథకం కావడంతో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్కీమ్‌ను పోస్టాఫీసుల ద్వారా మాత్రమే ప్రారంభించవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడానికి పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరి.ఈ పథకంలో పెట్టుబడికి 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే పెట్టుబడి చేసిన మొత్తం ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే వెనక్కి తీసుకోవచ్చు. ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షించి నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 2026–27 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్–జూన్) వడ్డీ రేటు 7.7 శాతంగా నిర్ణయించబడింది.దీంతో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఈ పథకం ద్వారా ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పెట్టుబడికి ప్రభుత్వ భద్రత ఉండటం కూడా పెద్ద ప్లస్‌గా మారుతోంది. అందుకే చాలా మంది ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.ఈ పథకంలో కనీస పెట్టుబడి ఏడాదికి రూ.1,000 మాత్రమే. గరిష్ట పరిమితి లేదు. అంటే ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. అదనంగా, ఈ స్కీమ్‌లో పెట్టుబడులకు పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు రూ.1.5 లక్షల వరకు మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.ఈ పథకంలో మరో ప్రత్యేక ప్రయోజనం కూడా ఉంది. నాలుగు సంవత్సరాల పాటు వచ్చే వడ్డీ ఆటోమేటిక్‌గా తిరిగి పెట్టుబడిగా మారుతుంది. దీనివల్ల కాంపౌండింగ్ ప్రయోజనం పెరుగుతుంది మరియు తదుపరి సంవత్సరాల్లో అదనపు రాబడి లభిస్తుంది. అయితే ఐదో సంవత్సరంలో వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి చేయడం సాధ్యం కాదు.
Latest News