|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 04:04 PM
AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 44.4°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.1°C అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి భగభగలకు తోడు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రానున్న రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గురువారం రాష్ట్రంలోని 76 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 134 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం తెలిపింది.
Latest News