|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:58 PM
విశాఖ నగరంలోని అన్ని వార్డులు, కాలనీలు, వీధుల్లో పారిశుధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ప్రాథమిక పౌర సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పనులను పూర్తి చేయాలని సూచించారు.
Latest News