|
|
by Suryaa Desk | Mon, Apr 27, 2026, 12:06 PM
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 13వ ద్విపక్ష ఒప్పందానికి సంబంధించిన చర్చలను వెంటనే ప్రారంభించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలోలా కాకుండా, ఈసారి 12 నెలల్లోనే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రక్రియలో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌తో పాటు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వేతనాలను ఖరారు చేయనున్నారు. ఒప్పందంతో పాటు సంబంధిత నియమాలను ఒకేసారి సవరించే విధానాన్ని అనుసరించనున్నారు.
Latest News