|
|
by Suryaa Desk | Mon, Apr 27, 2026, 03:00 PM
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, బ్లాక్ మార్కెట్ దందాపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాల వారీగా మొబైల్ స్క్వాడ్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బంకుల స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల వివరాలు, గత 15 రోజుల డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమ నిల్వలు లేదా అధిక ధరల విక్రయాలు గుర్తిస్తే లైసెన్స్ రద్దు, జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది.
Latest News