|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 11:48 AM
లద్దాఖ్ ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌ను కేవలం రెండు జిల్లాల నుంచి ఏడు జిల్లాల ప్రాంతంగా విస్తరించింది. కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికి చేరాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు రెండు రోజుల ముందు ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Latest News