|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 04:05 PM
దేశవ్యాప్తంగా హీట్‌వేవ్ తీవ్రత పెరగడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. సోమవారం ఒక్కరోజే గరిష్టంగా 255.85 గిగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఎయిర్ కండీషనర్లు, కూలర్లు అధికంగా వినియోగించడంతో పవర్ డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నెల రెండో అర్థభాగం నుంచి వినియోగం వరుసగా పెరుగుతుండగా, శుక్రవారం 252 గిగావాట్లు, శనివారం 256 గిగావాట్లు నమోదయ్యాయి. ఆదివారం మాత్రం సెలవులు, వర్షాల ప్రభావంతో వినియోగం 238 గిగావాట్లకు తగ్గింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉండటం గమనార్హం.
Latest News