|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 07:50 PM
PBKS vs RR: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య ఆసక్తికర పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు బలాల విషయానికి వస్తే, ఓపెనర్లు ప్రభసిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో వీరిద్దరూ వేగంగా పరుగులు సాధిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును సమర్థంగా ముందుకు నడిపిస్తున్నాడు.ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్‌తో మళ్లీ తమ లయను అందుకోవాలని ఆ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీలపై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ కీలక పాత్ర పోషించనున్నారు.
*తుది జట్లు ఇవే
-రాజస్థాన్ రాయల్స్ : వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
-పంజాబ్ కింగ్స్ : ప్రభసిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కానోలీ, సూర్యాన్ష్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లూకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.