|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 08:16 PM
టెక్ దిగ్గజం గూగుల్ తన గూగుల్ వాలెట్ యాప్‌లో కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో ఆధార్ ఆధారిత డిజిటల్ ఐడీని వాలెట్‌లో యాడ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఆధార్ వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో సురక్షితంగా స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. దీంతో ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా మారనుంది.గూగుల్ బ్లాగ్ పోస్టులో తెలిపిన వివరాల ప్రకారం, “డిజిటల్ ఐడీ సహాయంతో ఫిజికల్ వాలెట్ అవసరం లేకుండానే ఐడెంటిటీని నిరూపించుకోవచ్చు. గూగుల్ వాలెట్ ఇప్పుడు భారత్‌లో ఆధార్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్స్‌కు సపోర్ట్ చేస్తోంది. అలాగే సింగపూర్, తైవాన్, బ్రెజిల్ వంటి దేశాల్లో ఐడీ పాస్‌లను కూడా విస్తరిస్తున్నాం” అని పేర్కొంది.భారత యూజర్లు తమ ఆధార్‌ను గూగుల్ వాలెట్‌కు సులభంగా లింక్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డు అవసరం లేకుండానే ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ఫీచర్‌ను UIDAI భాగస్వామ్యంతో అభివృద్ధి చేసినట్లు గూగుల్ తెలిపింది. ఇందులో భద్రతా ప్రమాణాలు, గోప్యతా నిబంధనలు పూర్తిగా పాటించబడుతున్నాయని కంపెనీ స్పష్టం చేసింది.ఈ వ్యవస్థ ద్వారా యూజర్లు అవసరమైన సమాచారం మాత్రమే షేర్ చేయగలరు. పూర్తి ఆధార్ వివరాలు కాకుండా, అవసరమైన డేటా మాత్రమే వెరిఫికేషన్ సమయంలో పంచుకోవడం వల్ల ప్రైవసీ మరింత రక్షించబడుతుంది.ఈ డిజిటల్ ఆధార్ ఫీచర్ రోజువారీ జీవితంలో అనేక సేవలకు ఉపయోగపడనుంది. PVR INOX వంటి సినిమా థియేటర్లలో ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం, భారత్‌మ్యాట్రిమోనీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రొఫైల్ వెరిఫికేషన్ కోసం, అలాగే వీసా అప్లికేషన్లలో కూడా ఇది ఉపయోగపడుతుంది. త్వరలోనే MyGate వంటి గేటెడ్ కమ్యూనిటీలు మరియు గిగ్ వర్కర్ వెరిఫికేషన్ సేవలు కూడా ఈ ఫీచర్‌ను స్వీకరించే అవకాశం ఉంది.వాలెట్‌లో స్టోర్ చేసే ఆధార్ డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ చేయబడుతుందని, ఇది డివైజ్ సెక్యూరిటీ ఫీచర్లు వంటి స్క్రీన్ లాక్ లేదా బయోమెట్రిక్స్ ద్వారా రక్షించబడుతుందని గూగుల్ వెల్లడించింది. దీంతో యూజర్‌కు తన డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఎప్పుడు, ఎక్కడ షేర్ చేయాలో నిర్ణయించేది పూర్తిగా యూజర్‌నే అవుతాడు.గూగుల్ వాలెట్‌లో ఆధార్ యాడ్ చేసుకోవడానికి యాప్ తాజా వెర్షన్‌ను ఓపెన్ చేసి, “Add to Wallet” లేదా “+” ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే ఆప్షన్లలో “Aadhaar” లేదా “ID Pass” ఎంపిక చేసుకోవాలి. అనంతరం ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. అలాగే UIDAI ఆధార్ యాప్‌లోని “Share ID” ఆప్షన్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Latest News