|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 09:50 PM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.ఈ పరిణామం చమురు దేశాల కూటమికి, అలాగే దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC)లో యూఏఈ చాలా ఏళ్లుగా సభ్యదేశంగా కొనసాగుతోంది. ఒపెక్ స్థాపన జరిగిన ఏడేళ్ల తర్వాత, 1967లో యూఏఈ ఈ కూటమిలో చేరింది. ప్రస్తుతం సౌదీ అరేబియా, ఇరాక్ తరువాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా యూఏఈ ఉంది.అయితే కూటమి నుంచి వైదొలగడానికి గల కారణాలను యూఏఈ ఇప్పటివరకు వెల్లడించలేదు.
Latest News