|
|
by Suryaa Desk | Wed, Apr 29, 2026, 10:44 AM
RBI బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ‘ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL)’ విధానాన్ని ప్రవేశపెట్టి, రుణాలు మొండి బకాయిలుగా మారకముందే గుర్తించేలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇవి 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త విధానం ప్రకారం, రుణాలను 3 దశలుగా వర్గీకరించి, రిస్క్ ఆధారంగా బ్యాంకులు ముందుగానే నిధులు కేటాయించాలి. 30 రోజులు ఆలస్యం జరిగినా లోన్‌ను రిస్క్ కేటగిరీలోకి మార్చుతారు. ఒక రుణం చెల్లించకపోతే, అదే వ్యక్తి తీసుకున్న ఇతర రుణాలపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో లోన్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది.
Latest News