|
|
by Suryaa Desk | Wed, Apr 29, 2026, 11:13 AM
భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో బ్యాటింగ్‌తో అదరగొట్టింది. ఆయితే టీమిడియా (ఉమెన్) కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో అడుగుపెట్టింది. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఆమె 646 పాయింట్లతో ఒక స్థానం మెరుగుపరుచుకొని పదో ర్యాంక్‌కు చేరింది. స్మృతి మంధాన 5వ ర్యాంక్‌కు, షఫాలీ వర్మ 8వ ర్యాంక్‌కు పడిపోయారు. బౌలర్ల విభాగంలో దీప్తి శర్మ 4వ ర్యాంక్‌లో, శ్రీ చరణి 11వ ర్యాంక్‌లో ఉన్నారు.
Latest News