బెంగళూరులో వర్ష బీభత్సం.. నేలకూలిన చెట్లు, ధ్వంసమైన వాహనాలు
 

by Suryaa Desk | Wed, Apr 29, 2026, 09:00 PM

బెంగళూరు నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వాన నగరాన్ని తడిసిముద్ద చేసింది.కొన్ని ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు కుండపోతగా వర్షం పడింది. దీంతో అనేక చోట్ల చెట్లు నేలకూలగా, పెద్ద సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి.భారత వాతావరణ శాఖ ఇప్పటికే బెంగళూరుతో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపు కూడా నగరంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది.వర్షాల ప్రభావంతో బెంగళూరులో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణం చల్లబడడంతో ఎండలతో ఇబ్బంది పడ్డ నగరవాసులకు కొంత ఉపశమనం లభించింది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM