|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 12:17 PM
వైసీపీ మీడియా విభాగపు ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి కుప్పం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై కుప్పం పోలీసులు ఆయన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీపీఆర్వోగా పనిచేసిన శ్రీహరిపై అక్రమ కేసులు బనాయించారని వైసీపీ ఆరోపించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి, వేధించారని పార్టీ నాయకులు విమర్శించారు. అయితే కోర్టు శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది.
Latest News