|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 03:53 PM
ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హెచ్చరించారు. డీజిల్ కోసం రైతులు, పెట్రోల్ కోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే.. వారి అవసరాలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. రైతు కన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులే ప్రాధాన్యమా? అని నిలదీశారు. ముందుగా రైతులకు, ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా చూడాలని, ఆ తర్వాతే కాంట్రాక్టర్లకు ప్రత్యేక సదుపాయాలపై మాట్లాడాలని సూచించారు.
Latest News