|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 09:58 PM
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ POCO తన లైనప్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. Poco C81 Pro ను గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T7250 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.ఈ ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే 6.9-అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 6,000mAh భారీ బ్యాటరీ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. Poco C81 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
*Poco C81 Pro ధర : ఈ స్మార్ట్‌ఫోన్ 4GB + 64GB వేరియంట్ ధర సుమారు రూ.9,300గా ఉంది. 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,000 కాగా, 256GB వేరియంట్ ధర రూ.12,000గా నిర్ణయించారు. బ్లాక్, గోల్డ్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో మాత్రమే విక్రయానికి వచ్చింది.
*Poco C81 Pro స్పెసిఫికేషన్లు : Poco C81 Pro లో 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ ఆధారిత HyperOS 3 పై ఈ డివైస్ పనిచేస్తుంది.పర్ఫార్మెన్స్ కోసం Mali-G57 GPUతో కూడిన 12nm ఆక్టా-కోర్ Unisoc T7250 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 4GB RAMతో పాటు 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్ ఉంది. RAM ను 8GB వరకు వర్చువల్‌గా విస్తరించుకునే సౌకర్యం కూడా ఉంది.కెమెరా విభాగంలో వెనుక భాగంలో 13MP ప్రైమరీ సెన్సార్ ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. వెట్ టచ్ టెక్నాలజీ 2.0 సపోర్ట్‌తో తడి చేతులతో కూడా ఫోన్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు.బ్యాటరీ పరంగా 6,000mAh భారీ బ్యాటరీతో పాటు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 79 గంటలకు పైగా మ్యూజిక్ ప్లేబ్యాక్ అందించగలదని కంపెనీ చెబుతోంది.కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ 5.2, వై-ఫై, GPS, USB టైప్-సి పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.