|
|
by Suryaa Desk | Fri, May 01, 2026, 08:45 PM
DC vs RR: ఆరంభంలోనే దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లను ఢిల్లీ బౌలర్లు త్వరగా డగౌట్‌కు పంపించారు. పంతొమ్మిదో సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మిచెల్ స్టార్క్, యశస్వీ జైస్వాల్ (6)ను ఫుల్‌టాస్ బంతితో ఔట్ చేశాడు.అదే జోరులో వైభవ్ సూర్యవంశీ (4)ను కైలీ జేమీసన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. డేంజరస్‌గా కనిపిస్తున్న వైభవ్ వికెట్ తీసిన ఆనందంలో జేమీసన్ ఉత్సాహంగా అరుస్తూ, అతని వైపు చూస్తూ చప్పట్లు కొడుతూ ఉత్సాహభరితంగా సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ ఎడిషన్‌లో ఈ ఇద్దరు ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే ఔట్ కావడం ఇదే మొదటిసారి.ఇప్పటివరకు బౌలర్లకు కష్టంగా మారిన వైభవ్ సూర్యవంశీ జోరును జేమీసన్ సమర్థంగా ఆపాడు. తొలి బంతినే స్ట్రెయిట్ బౌండరీ కొట్టిన వైభవ్‌ను, తరువాతి బంతిలో ఫుల్‌టాస్‌తో మోసం చేసి వికెట్ పడగొట్టాడు. బంతిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వైభవ్ వికెట్‌ను కాపాడుకోలేకపోయాడు.ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే సిక్సర్ కొట్టిన యశస్వీ జైస్వాల్‌ను స్టార్క్ ఔట్ చేసి ఢిల్లీకి శుభారంభం ఇచ్చాడు. వరుసగా ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రియాన్ పరాగ్ (25 నాటౌట్), ధ్రువ్ జురెల్ (21 నాటౌట్) నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జట్టుకు భారీ స్కోరు అందించాలనే లక్ష్యంతో పరాగ్ ఆరవ ఓవర్లో 6, 4, 6 బాదడంతో స్కోరు 50 దాటింది. పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 56 పరుగులు చేసింది.
Latest News