|
|
by Suryaa Desk | Fri, May 01, 2026, 10:56 PM
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఝాన్సీ వైపు వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు రైలుపై ఐరన్ రాడ్‌తో దాడికి పాల్పడటంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.రైలు (నంబర్ 12280) ఢిల్లీ నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పట్టాల పక్కన మాటువేసిన దుండగులు ఇనుప రాడ్‌ను రైలుపైకి విసరడంతో అది కిటికీ అద్దాన్ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి దూసుకొచ్చింది. ఈ దాడిలో ఓ ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. జరిగిన ఈ ఘటనతో కోచ్‌లోని ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. గాయపడిన వ్యక్తిని సహ ప్రయాణికులు వెంటనే సాయమందించారు. ఘటనపై ఇతర ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే రైల్వే భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైళ్లలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని కోరుతున్నారు.
Latest News