IPL 2026 బిగ్ క్లాష్: చెన్నై vs ముంబై లేటెస్ట్ అప్‌డేట్స్
 

by Suryaa Desk | Sat, May 02, 2026, 09:40 PM

IPL 2026 Match 44లో భాగంగా చెన్నై వేదికగా Chennai Super Kings మరియు Mumbai Indians జట్లు తలపడుతున్నాయి.ముంబై ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నమన్ ధీర్ 48 పరుగులతో మంచి ఫామ్‌లో ఉండగా, హార్దిక్ పాండ్యా 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అనంతరం 13 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. తిలక్ వర్మ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను నూర్ అహ్మద్ బౌలింగ్‌లో Ruturaj Gaikwadకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో నమన్ ధీర్ 44 పరుగులు, పాండ్యా 1 పరుగు వద్ద క్రీజులో ఉన్నారు.ఇక 7 ఓవర్లు ముగిసే సరికి ముంబై 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నమన్ ధీర్ 25 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు 4 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 1 వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. రికెల్టన్ 15 పరుగులు, నమన్ ధీర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.ముంబై ఇన్నింగ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ విల్ జాక్స్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ముంబై తొలి వికెట్‌ను 1 పరుగుకే కోల్పోయింది.టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. రఘు శర్మ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతుండగా, అశ్వనీ కుమార్ స్థానంలో క్రిష్ భగత్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అకిల్ హొసేన్ స్థానంలో ప్రశాంత్ వీర్, గుర్జప్‌నీత్ సింగ్ స్థానంలో రామకృష్ణ ఘోష్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, జెమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టులో విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్‌ప్రీత్ బుమ్రా, ఘజన్‌ఫర్ బరిలోకి దిగారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM