|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 04:13 PM
సంక్రాంతికి తెలుగు నుంచి 5, తమిళం నుంచి 2 సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో మొత్తం 7 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. జనవరి 9న 'రాజా సాబ్', 'జన నాయగన్' విడుదల కాగా, 'అనగనగా ఒకరాజు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'నారినారి నడుమ మురారి' చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. స్టార్ హీరోలతో పాటు యువ హీరోల చిత్రాలు కూడా రావడంతో థియేటర్ల పంపిణీపై తీవ్ర ప్రభావం పడనుంది. గతంలో 4 సినిమాలకే థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారిన నేపథ్యంలో, 7 చిత్రాలు వస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
Latest News